Dispute in Guntur AC Law College Principal Post: దాడికి దారి తీసిన ఏసీ​ న్యాయకళాశాల ప్రిన్సిపాల్ పదవి.. - Guravaya group attack on Amrita Varshini

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 10:38 PM IST

Dispute in Guntur AC Law College Principal Post : గుంటూరులోని ఏసీ​ న్యాయకళాశాల ప్రిన్సిపాల్ పదవి అంశంలో తలెత్తిన వివాదం దాడులకు దారి తీసింది. ప్రిన్సిపాల్ బాధ్యతలను ఎవరు చేపట్టాలనే విషయంలో రెండు వర్గాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఇదే అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. గురవయ్యను ప్రిన్సిపాల్​గా కొనసాగాలని సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. అయితే గురవయ్య నియామకం చెల్లదని వైస్ ప్రిన్సిపాల్ అమృత వర్షిణి కోర్టును ఆశ్రయించారు. ప్రిన్సిపాల్​గా గురవయ్య కొనసాగటం సరికాదని హైకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. అమృత వర్షిణికి అనుకూలంగా ఆదేశాలు జారి చేసింది. హైకోర్టు బెంచ్ ఆదేశాలతో ప్రిన్సిపాల్​గా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన అమృత వర్షిణిపై గురవయ్య వర్గం దాడికి దిగింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. దాంతో ఆమె జీజీహెచ్​లో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులోని క్రైస్తవ సంస్థ ఏఈఎల్సీ ఆస్తుల విషయంలో కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఏసీ కళాశాల కూడా ఈ పరిధిలోకే వస్తుంది. రెండు వర్గాలుగా విడిపోయి తరచుగా వివాదాలకు చోటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.