చిల్లకూరు వైసీపీలో వర్గ విభేదాలు - వ్యతిరేక వర్గీయుడిపై పలువురు దాడి - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 3:34 PM IST
Dispute Between Chillakur YSRCP : తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో ఇంకా అనాగరిక చర్యలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డిల వ్యతిరేక వర్గీయుడైన రాకేష్‌రెడ్డి (Rakesh Reddy)పై వెలివేత ఆంక్షలు విధించారు. ఎవరూ మాట్లాడవద్దని గ్రామస్థులను ఆదేశించారు. బాధితుడి ఇంటికి ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా కంకర గుట్టలుగా పోసి రాకపోకలు నిలిపివేశారు.
YSRCP Leaders Attack : ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవేమీ లెక్క చేయకుండా ఎన్డీసీసీబీ ఛైర్మన్ అనాగరిక చర్యలకు పాల్పడినట్లు తెలిపాడు. తనను అతని ఇంటి ముందు స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడినట్లు బాధితుడు రాకేశ్‌రెడ్డి వాపోయాడు. పోలీసులు చూస్తూ నిమ్మకుండిపోయారని మండిపడ్డాడు. తాను ఎన్నో ఏళ్లుగా వైఎస్సార్సీపీలో పని చేస్తున్నానని తనపై ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య (YSRCP MLA Kiliveti Sanjeevaiah) వైఖరి అనాగరికమని బాధితుడు పేర్కొన్నాడు.