Director Puja Kolluru Interview in Telugu : పదేళ్ల కష్టం.. అమెరికాలో డైరెక్షన్‌ పాఠాలు.. తెలుగు చిత్ర పరిశ్రమకు మరో మహిళా దర్శకురాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 2:23 PM IST

Updated : Oct 26, 2023, 3:39 PM IST

thumbnail

Director Puja Kolluru Interview in Telugu : ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు చాలా మంది. కానీ, తాను మాత్రం అందుకు భిన్నం. హాలీవుడ్‌లో ప్రతిభను చాటి టాలీవుడ్‌కొచ్చింది. తల్లిదండ్రుల ఆకాంక్షలకు భిన్నంగా సినిమా రంగాన్ని ఎంచుకుంది. తన ప్రతిభకు రూ.1.70 కోట్ల ఉపకారవేతనం అందుకుని అమెరికాలో డైరెక్షన్‌ పాఠాలు నేర్చుకుంది. పలు డాక్యుమెంటరీలు రూపొందించి అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో తెలుగు తెరకు డైరెక్టర్‌గా పరిచయం కాబోతుంది. రిలయన్స్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమాకి సైతం దర్శకత్వ బాధ్యతలు తీసుకొంది. పదేళ్ల కష్టం తర్వాత తన కలను సాకారం చేసుకోబోతున్న యువ దర్శకురాలు పూజా కొల్లూరుతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Martin Luther King (MLK) Film Director Interview : లాబ్రెంత్ అనే స్పానిష్ సినిమా ద్వారా స్ఫూర్తి పొందిన పూజా... తల్లిదండ్రులను ఒప్పించి సినిమా రంగంలో అడుగులు వేసింది. మహీంద్రా యునైటెడ్ వరల్డ్ కాలేజ్ నుంచి రూ.25 లక్షల స్కాలర్‌షిప్ సాధించి, ఫిలిం స్టడీస్‌లో డిప్లొమా చేశారు పూజా. అమెరికాలో రూ. 1.70 కోట్ల స్కాలర్ షిప్ సాధించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.మెగ్లోమాన్​పై డాక్యుమెంటరీ రూపకల్పన చేశారు. డైరెక్టింగ్, స్క్రీన్ రైటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాల్లో డిగ్రీ పట్టా పొందారు. ఎ ఉమెన్ హూ క్లైంబ్స్ ట్రీస్ డాక్యుమెంటరీకి దాదాసాహేబ్ ఫాల్కే స్పెషల్ జ్యూరీ అవార్డు గెలిచారు. కోర్సు థీసిస్ ఫిలిం 'రిఫ్లెక్షన్' కు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకురాలి అవార్డులు సొంతం చేసుకున్నారు పూజా. 30 కిపైగా చిత్రాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలకు పనిచేసిన పూజా... అన్నపూర్ణ ఫిలిం ఇన్​స్టిట్యూట్‌లో శిక్షకురాలిగా పనిచేశారు. సమాజానికి మంచి సినిమాలు అందించాలన్నదే తన లక్ష్యమంటున్నారు పూజా. ఈనెల 27న విడుదల కానున్న మార్టిన్ లూథర్ కింగ్​కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపే తన ధ్యేయమని పూజా ఈటీవీ భారత్​తో ఇంటర్వ్యూలో తెలిపారు.

Last Updated : Oct 26, 2023, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.