Dhulipalla Narendra Road Widening Issue: రహదారి విస్తరణ బాధితులకు అండగా ధూళిపాళ్ల.. మున్సిపల్ కార్యాలయంలో బైఠాయింపు - పొన్నూరులో రోడ్డు విస్తరణ బాధితులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2023, 7:41 PM IST

Dhulipalla Narendra Kumar about Road Widening Issue: గుంటూరు జిల్లా పొన్నూరులో రోడ్డు విస్తరణలో నష్టపోతున్న బాధితులకు పరిహారం అందించి తరువాత పనులు మొదలుపెడితే బాగుంటుందని, అడ్డగోలుగా పడగొడితే సహించమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు. రోడ్డు విస్తరణలో నష్టపోయిన బాధితులకు అందించే పరిహారం వివరాలను తెలియజేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం టీపీఓ సెక్షన్లో బైఠాయించారు. రోడ్డు విస్తరణకు సంబంధించి వచ్చిన అనుమతులు, అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను బయటపెట్టాలని నిలదీశారు. రోడ్డు విస్తరణ కోసం పడగొట్టిన భవన యజమానులలో ఇప్పటికీ చాలామందికి నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. భవనాలు కూల్చి 15 రోజులు గడుస్తున్నా పరిహారం చెల్లించకపోవడంపై ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందనే అహంకారంతోనే నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా భవనాలను కూల్చారని మండిపడ్డారు. రోడ్డు విస్తరణకు ముందు ప్రతి ఇంటికి వెళ్లి నన్ను నమ్మండి అని నమ్మించిన ఎమ్మెల్యే భవన యజమానులను నిలువునా మోసం చేశారని అన్నారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు అధికారులు భవనాలు కూల్చారని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతి అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకూ పోరాటం చేస్తామని ధూళిపాళ్ల హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.