పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించిన దేవినేని ఉమ - గోదావరికి పూజలు - Water drought in AP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 4:38 PM IST
Devineni Uma Visited Pattiseema Project: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమ పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు వద్ద గోదారి తల్లికి పూజలు నిర్వహించారు. చంద్రబాబు జాతి సంపద సంపద సృష్టించేవాడని తెలిపారు. ఎంతో కష్టంతో కట్టిన పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను గోదావరి తల్లిని పవిత్ర సంగమంలో కలిపిన ఒక మహా నాయకుడిని రాజమండ్రి జైల్లో నిర్బంధం చేశాడని ధ్వజమెత్తారు.
ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ అంశంపై విశాఖలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నా, ప్రభుత్వం ఐదు కోట్లు ఖర్చు పెడుతోందని చెప్పిన దేవినేని.. పట్టిసీమపై గురించి ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదని విమర్శించారు. 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాలో మూడు లక్షలు పంట వేయలేదని వెల్లడించారు. బాబాయి హత్య కేసులో తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడని దుయ్యబట్టారు. 440 మండలాల్లో కరవు విలయతాండవం చేస్తుంటే 110 మండలాలలో మాత్రమే కరవు ఉందని చెప్పడం దుర్మార్గమని అన్నారు.