జగన్ కళ్లలో ఆనందం కోసమే కేశినేని నాని రాజకీయాలు: దేవినేని ఉమ - Keshineni Nani joined YCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 12:45 PM IST
Devineni Uma Fires on Kesineni Nani: కేశినేని నాని కేవలం ఎంపీ పదవి కోసం ఇంత దిగజారి మాట్లాడాలా అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. నిన్నటివరకు దుర్మార్గుడిలా కనిపించిన జగన్ రెడ్డి ఇప్పుడు నానీకి సన్మార్గుడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు. దుర్మార్గుడితో ఉండాలనుకుంటే అది నానీ ఇష్టం కానీ అమరావతి రైతుల్ని కించపరచడం ఏమిటి అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబుని, లోకేశ్‌ని దుర్భాషలడటం తగదని హెచ్చరించారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల నాయకులు కేశినేని నానీకి దూరంగా ఉన్నారు అంటే అది కేవలం ఆయన నోటి దురుసుతనం వల్లేనని ఉమా పేర్కొన్నారు. నానీ ఏకపక్షంగా తన కుమార్తెను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్నా ఆయనకు రెండుసార్లు ఎంపీ టికెట్ ఇచ్చిన టీడీపీ ఏమీ అనలేదని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో నానీ గెలుపుకోసం విజయవాడ పార్లమెంట్ పరిధిలోని టీడీపీఅభ్యర్థులు, పార్టీ డబ్బు ఖర్చుపెట్టింది తప్ప, నానీ రూపాయి పెట్టలేదని ఉమా తేల్చిచెప్పారు.
Budha Venkanna Fires on Kesineni Nani: టీడీపీలో సీటు రాదనే అభద్రతాభావంతో పార్టీ మారి చంద్రబాబు, లోకేశ్‌ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తిత్వం కేశినేని నానిదని బుద్దా వెంకన్న మండిపడ్డారు. కేశినేని నానికి వ్యతిరేకంగా మాట్లాడమని చంద్రబాబు తనకు ఎప్పుడూ చెప్పలేదని కుటుంబ సభ్యులపై బుద్దా వెంకన్న ప్రమాణం చేశారు. రాజకీయ మనుగడ కోసం చంద్రబాబుని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.