వసంత పరువు నష్టం నోటీసులపై స్పందించిన దేవినేని ఉమా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 10:24 PM IST
Devineni Respond on Vasantha Krishna Prasad Defamation Notices: ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పంపిన లీగల్ నోటీసులపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. కృష్ణప్రసాద్‌కు ధైర్యం ఉంటే తనపై అడ్వకేట్ కమీషన్ వేయించుకోవాలన్నారు. త్వరలో వసంత అవినీతి చిట్టా మొత్తం కోర్టు ముందు ఉంచుతామన్నారు. ప్రకృతి సంపద దోచుకున్న ఎమ్మెల్యే వసంత తన మీద రూ. 10కోట్ల పరువు నష్టం వేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులకే పరువు లేదు, ఇంకా వసంత కృష్ణప్రసాద్‌కు క్షమాపణ చెప్పాలా అని ఉమా నిలదీశారు.
వసంత ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ అవినీతి డబ్బులు, బిల్లుల కోసం తిరుగుతున్నాడని మండిపడ్డారు. కొండపల్లి అడవిలో ఎమ్మెల్యే దోపిడితో ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు సస్పెండ్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగర్భ శ్రీమంతుడినని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తనకు ఓటు వేసిన ప్రజల్ని మోసం చేసి అమెరికా వెళ్లి డాన్స్‌లు వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. వసంత కుటుంబానికి ఒకే రోజు మూడు పార్టీలు మార్చిన చరిత్ర ఉందని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో తెలియని పరిస్థితి నెలకొందని దేవినేని విమర్శించారు.