కరవు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ వినూత్న నిరసన - 'ఎండిన పంటలు, మట్టి పాత్రల్లో గంజి'

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 6:04 PM IST

Demand to Declare Anantapur District as Drought Zone : ఉమ్మడి అనంతపురం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ విన్నూతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట.. ఎండిన పంటలతో, మట్టి పాత్రల్లో గంజి తాగుతూ ఆందోళన చేశారు. ప్రభుత్వం జిల్లాలో ఉన్న కరవు తీవ్రతను గుర్తించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్నామంటూ కంటితుడుపు చర్యలు చేపడుతుందని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ విమర్శించారు. కరవు మండలను ప్రకటించిన మాత్రన రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని.. అందుకు సరైన సహాయక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 

రబీ, ఖరీఫ్ లో నష్టపోయిన రైతులను ఆదుకోనేందుకు.. ఎలాంటి కార్యాచరణ అమలు కాలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి గ్రామానికిి వెళ్ళి రైతుల పడే ఇబ్బందులు చూడాల్సిందిగా తెలియజేశారు. ఉమ్మడి జిల్లాలో కరవు శాపంగా మారిందని పేర్కొన్నారు. ఇవాళ వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు.. వలసబాట పట్టారని.. దీనికి ప్రభుత్వమే అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిపై నివేదికను రూపొందించి.. కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.