DCHS AVR Mohan: వసతి గృహాల్లో దారుణ పరిస్థితులు.. డీసీహెచ్ఎస్ తనిఖీల్లో బయటపడిన వైనం
🎬 Watch Now: Feature Video
DCHS AVR Mohan Visited BC Welfare Hostels: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ కళాశాల విద్యార్థుల వసతి గృహంలో నెలకొన్న దారుణ పరిస్థితులను చూసి డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏవీఆర్ మోహన్ నివ్వెరపోయారు. పట్టణంలోని ఎస్సీ కళాశాల బాలుర, బీసీ కళాశాల బాలుర వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం బీసీ వసతి గృహంలో విద్యార్థుల మధ్యే రాత్రి బస చేశారు. విద్యార్థులకు వసతి గృహాల్లో అందుతున్న మౌలిక వసతుల మెనూ గురించి ఆరా తీశారు. ఎస్సీ బాలుర వార్డెన్ సత్యనారాయణ అందుబాటులో ఉండటం లేదని, చింతలపూడిలో నివాసం ఉంటూ వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే హాస్టల్‌కు వస్తున్నట్లు ఆయన తెలుసుకున్నారు. మోనూ సక్రమంగా అమలు కావడం లేదని.. తాగునీటి ప్లాంట్ లేకపోవడం, మరుగుదొడ్ల కొరత, జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు కొందరు భయభ్రాంతులకు గురిచేస్తుండటం, తదితర సమస్యలను గుర్తించారు. విచారణ అనంతరం సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌కు నివేదిస్తామని మోహన్ వెల్లడించారు.