Dalit Farmers Agitation In Nellore : 20ఏళ్లుగా భూమి సాగు చేస్తున్న దళితులు.. పట్టాలు సృష్టించి కబ్జా చేస్తున్న వైసీపీ నేతలు - andhra politics latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-08-2023/640-480-19279921-638-19279921-1692184591101.jpg)
Dalit Farmers Agitation In Nellore : సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని నెల్లూరు జిల్లా మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద పొంగూరు గ్రామానికి చెందిన దళిత రైతులు ఆందోళన చేపట్టారు. 40 కుటుంబాలకు చెందిన దళిత రైతులు గ్రామానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను 2003వ సంవత్సరం నుంచి సాగు చేసుకుంటున్నారు. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోడం లేదని తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇటీవల ఆ భూముల పక్కన రిజర్వాయర్ రావడంతో వాటి పై కన్నేసిన స్థానిక వైసీపీకి చెందిన భూకబ్జా రాయుళ్లు అధికారుల అండదండలతో పట్టాలు సృష్టించి వాటిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. అక్రమంగా పెత్తందారులకు ఇచ్చిన పట్టాలు రద్దు చేయాలని అన్నారు. దళితులపై ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి అని నినాదాలు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న పొలాలకు పట్టాలు ఇచ్చి తమకు న్యాయం చేయాలని దళిత రైతులు వేడుకుంటున్నారు.