CPI Ramakrishna on Data Theft: డేటా చోరీపై సీఎం జగన్ స్పందించాలి.. తప్పుంటే క్షమాపణలు చెప్పాలి.. - డేటా చోరీపై సీపీఐ రామకృష్ణ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
CPI Ramakrishna Comments on Data Theft: డేటా చోరీపై టీడీపీ, జనసేనలు చేస్తున్న ఆరోపణలపై.. సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. వాలంటీర్లతో ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తూ హైదరాబాద్‌లో భద్రపరుస్తున్నారన్న దానిపై సీఎం జగన్ స్పందించాలని రామకృష్ణ అన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచి.. దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. అలాంటిది ప్రభుత్వమే ఇటువంటి పనులకు పాల్పడుతుందంటే.. అంతకంటే ఘోరమైన విషయం మరొకటిలేదని మండిపడ్డారు. వాలంటీర్లతో ప్రజల వ్యక్తిగత డేటా సేకరణపై పూర్తిగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిజంగా డేటా చోరీ జరిగితే ప్రజలకు సీఎం క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అన్నారని రామకృష్ణ గుర్తు చేశారు. నేడు ఆ కేసులను ఉపసంహరించుకోకపోగా అదనంగా మరిన్ని సెక్షన్లు పెట్టి విద్యార్థులకు శిక్షపడేలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.