CPI Ramakrishna Fires on CM Jagan: అమాయకులపై కేసులు పెట్టి జైళ్లకు పంపడం దుర్మార్గం: రామకృష్ణ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 7:15 PM IST
CPI Ramakrishna Fires on CM Jagan: వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరు, అంగళ్లు ఘటనలే.. అధికార పార్టీ అహంకారానికి పరాకాష్టని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమాయకులపై కేసులు పెట్టి వేధించడం, జైళ్లకు పంపడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్షాల సభలు, సమావేశాలు అడ్డుకోవడం.. హక్కులు కాలరాయడమేనని రామకృష్ణ ధ్వజమెత్తారు. టీడీపీకు సీపీఐ వత్తాసు పలుకుతోందని కొందరు విమర్శిస్తున్నారని.. ఏ పార్టీ నేతలపైనా దాడులూ సరికాదని.. బీజేపీపై దాడులు చేసినా ప్రశ్నిస్తామన్నారు. ఇలాంటి అరాచక ప్రభుత్వం త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదని రామకృష్ణ హెచ్చరించారు.
రాష్ట్రంలోని వనరులను దోచుకుని వచ్చే ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలు యత్నిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ వైసీపీకి పట్టం కడితే రాష్ట్రాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితి తీసుకొస్తారని ఆగ్రహం వక్తం చేశారు. ప్రభుత్వ నియంతృత్వ చర్యలపై త్వరలో అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. అధికారం ఉంది కదా అని పోలీసులను ఉపయోగించుకొని ఇష్టారీతిన ప్రవర్తిస్తే.. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మండిపడ్డారు.