పొత్తుల విషయంలో బీజేపీ బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోంది: సీపీఐ రామకృష్ణ - బీజేపీపై రామకృష్ణ ఫైర్
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 5:55 PM IST
CPI Ramakrishna Critisized BJP Threatening Alliances: తెలుగుదేశంతో పొత్తుల విషయంలో భారతీయ జనతా పార్టీ బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన నాలుగున్నర సంవత్సరాలుగా జగన్‌ను బీజేపీ నెత్తిన పెట్టుకుని మోసిందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పులపాలై అధోగతి పట్టడానికి కేంద్రమే ప్రధాన కారణమని ఆరోపించారు.
CPI Ramakrishna Fires on BJP: చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టడం వెనుక కేంద్ర హోంశాఖ సహకారం ఉందని 17ఏ పై సుప్రీంకోర్టులో తీర్పు రాకుండా అడ్డుకొని తెలుగుదేశం పార్టీని బ‌్లాక్‌మెయిల్ చేస్తోందని పేర్కొన్నారు. జగన్ నాలుగేళ్ల పాలనలో దళితులపై నిత్యం దాడులు, హత్యలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి జగన్ విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ప్రారంభించటం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. బీజేపీ నేత సత్యకుమార్ చేసిన బెదిరింపు వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు స్పందించాలన్నారు. బీజేపీ బ్లాక్ మెయిల్‌కు టీడీపీ లొంగకుండా ఆత్మ గౌరవంతో నిలబడాలని సూచించారు. కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో జగన్‌ను ఇంటికి పంపించే పార్టీలతో తాము కలిసి వెళ్తామని స్పష్టం చేశారు.