CPI Narayana Fires on BJP and YSRCP: బీజేపీ, వైసీపీ ఒక్కటే.. పేరు మాత్రమే వేరు: నారాయణ - ఎన్టీఆర్ జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
CPI Narayana Fires on BJP and YSRCP: తెలంగాణాలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ప్రభుత్వం.. బీజేపీతోనే కలిసి ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఈ క్రమంలో లోక్సభ, రాజ్యసభలో ఎటువంటి బిల్లులు పెట్టినా సీఎం జగన్మోహన్ రెడ్డి సమర్థించారని ఆయన అన్నారు. బీజేపీ, వైసీపీ పేరు మాత్రమే మార్పు.. రెండు పార్టీలూ ఒక్కటేనని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలకు ప్రధాన శత్రువు బీజేపీనే అని నారాయణ విమర్శించారు. విభజన చట్టం అమలు చేయకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు.
"తెలంగాణాలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ప్రభుత్వం.. బీజేపీతోనే కలిసి ఉన్నాయి. లోక్ సభ, రాజ్యసభలో ఎటువంటి బిల్లులు పెట్టినా దాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి సమర్థించారు. బీజేపీ, వైసీపీ పేరు మాత్రమే మార్పు.. రెండు పార్టీలూ ఒక్కటే. తెలుగు రాష్ట్రాలకు ప్రధాన శత్రువు బీజేపీనే. విభజన చట్టం అమలు చేయకుండా రాష్ట్రాన్ని నాశనం చేశారు." - కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి