అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే జగన్​కు పట్టదా?: సీపీఐ శ్రీనివాసరావు - అంగన్వాడీ కార్యకర్తల నిరసన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2024, 3:30 PM IST

CPI Leader Srinivasulu Fire on CM Jagan : తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా అంగన్వాడీలకు వేతనం ఇస్తానన్న సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మాట తప్పారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు సుందరయ్య భవనంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెలిగారు. జగన్‌ మోహన్ రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీలకు హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని, మాట తప్పారని విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ల పరిష్కారం కోసం 36 రోజుల నుంచి అన్ని వదిలేసి రోడ్లెక్కి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Jagan Not Respond on Anganwadi Protest : అంగన్వాడీలపై ప్రభుత్వం ఏస్మా చట్టాన్ని ప్రయోగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అంగన్వాడీలను చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వారి డిమాండ్లను నెరవేర్చకపోతే రేపటి నుంచి దీక్షలకు దిగుతామని అంగన్వాడీలు చెప్పారని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.