ప్రజలు మార్పు కోరుకుంటున్నారు - మోదీ పాలనలో విసుగు చెందారు: డి. రాజా - ప్రధాని మోదీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 7:04 PM IST

CPI Leader Raja Comments On BJP: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లోనూ.. కాంగ్రెస్​ అలియన్స్​కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడలోని దాసరి భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మోదీ పాలనలో విసుగు చెందారని విమర్శించారు. ఈ నేపథ్యంలోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. మోదీ పాలనలో దేశ అర్థిక పరిస్థితి దిగజారిందని ఆరోపించారు. 

కేంద్రంలో బీజేపీని ఓడిచేందుకు సెక్యులర్ పార్టీలన్నీ జత కట్టాయని అన్నారు. ఇండియా కూటమిగా ఏర్పాటై బీజేపీని గద్దె దించేందుకు ఒక్కటయ్యాయని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దే దించడమే ధ్యేయంగా ఇండియా కూటమి పని చేస్తుందని స్పష్టం చేశారు. ​నిరుద్యోగం పెరిగిపోతోందని.. కార్పొరెట్​ కంపెనీలకు లబ్ది చేకూర్చేలా మోదీ విధానాలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన మూడు రోజులపాటు చేపట్టిన నిరసనలకు సీపీఐ మద్దతు ఇస్తోందని అన్నారు. ''సేవ్​ ఇండియా రిజెక్ట్​ బీజేపీ'' అని యువత అంటున్నారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.