'కడపను కరవు జిల్లాగా ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం' - ఏపీ రైతుల కష్టాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 7:28 PM IST
CPI, CPM Protest in Kadapa District : అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్టు.. కడప జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నా... అర సెంటు భూముకి కూడా నీరు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఏటీయూసీ రాష్ట్ర నాయకులు ఓబులేసు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కరవు తాండవిస్తుంటే కళ్లు ఉండి కూడా చూడలేని స్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కడప కలెక్టరేట్ ఎదురుగా వామపక్షాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. తక్షణమే సీఎం జగన్ కడపను కరవు జిల్లాగా ప్రకటించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Drought Conditions in Kadapa : నాలుగున్నరేళ్ల నుంచి రైతులకు చుక్క సాగునీరు అందించలేకపోయారన్నారు. కేసీ పంట కింద ఒక పంట పడే అవకాశం ఉన్నప్పటికీ అదీ అందిచట్లేరని మండిపడ్డారు. సీఎం సొంత జిల్లా, పలువురు వైసీపీ నేతలు ఉండే ప్రాంతంలో ఇలాంటి దుస్థితిని పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.