భీమవరంలో జగన్ పర్యటన-స్థానిక నేతల గృహనిర్బంధం - భీమవరంలో జగన్ పర్యటన

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 12:05 PM IST

CPI And CPM Leaders House Arrest : సీఎం జగన్‌ మోహన్ రెడ్డి భీమవరం పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తు ఆంక్షలు విధిస్తున్నారు. సీపీఎం జిల్లా కార్యాలయాన్ని ముట్టడించిన పోలీసులు జిల్లా కార్యదర్శి బలరాం అరెస్టుకు యత్నించారు. సీపీఎం నేత గోపాలన్‌ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపిమూర్తిని పోలీసుస్టేషన్‌లో నిర్బంధించారు. ఉండిలో సీపీఎం నాయకుడు వాసుదేవరావును గృహనిర్బంధంలో ఉంచారు. అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలను ఖండించిన సీపీఎం నేతలు ఎందుకంత భయమని ప్రశ్నించారు. అంగన్వాడీ సిబ్బంది సైతం సీఎం పర్యటనను అడ్డుకుంటారని భావిస్తున్న పోలీసులు మహిళా పోలీసులతో వారిని కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

CM Jagan Tour in Bhimavaram : అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలను సీపీఎం ఖండించింది. ఈ విషయంపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అరెస్టులు చేయడం మానుకోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయానికి హితువు పిలికారు. జిల్లాలో తీవ్రంగా కాలుష్య సమస్య ఉందని, అలాగే ఎన్నో సమస్యలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.