Couple Suicide Attempt: పొరుగింటి వారితో గొడవ.. దంపతులు ఏం చేశారంటే..! - అనంతపురం జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Couple Suicide Attempt: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నెరమెట్లలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలోని కనకవీడు గ్రామానికి చెందిన నరసింహులు నెరమెట్ల గ్రామంలో 12 సంవత్సరాలుగా ఆర్ఎంపీ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. తన భార్య ద్రాక్షవేణి, ముగ్గురు పిల్లలతో కలసి అదే గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే పొరుగింటివారు తరచూ లేనిపోని కారణాలతో గొడవ పడటమేకాక కొన్ని సందర్భల్లో అకారణంగా దాడి చేశారని బాధితులు వాపోయారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా రెండిళ్ల మధ్య గొడవ జరిగింది. తమపై తరచూ దాడి చేస్తున్నా పట్టించుకునే వారు లేరని మనోవేదనకు గురైన ఆ దంపతులు ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే ఉన్న కొందరు గమనించి వారిని చికిత్స కోసం ఉరవకొండ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ 108 వాహనంలో అనంతపురానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఉరవకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.