NREGA Labour concerns: ఉపాధి హామీ సొమ్ము గోల్మాల్ వ్యవహారంలో కొనసాగుతున్న కూలీల నిరసన - అనకాపల్లి జిల్లాలో కూలీల ఆందోళన
🎬 Watch Now: Feature Video
NREGA Labour concerns: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అచ్చంపేట లోని ఉపాధి హామీ పథకం వీఆర్పీని తక్షణమే వీధిలో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలంతా గ్రామంలోని సచివాలయాన్ని ముట్టడించారు. స్థానిక వీఆర్పీ అక్రమాలు అవినీతిపై ఇప్పటికే స్పందన కార్యక్రమంలో ఏడు ఫిర్యాదులు అందజేసినప్పటికీ నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమని కూలీలు అన్నారు. గత కొంతకాలంగా వీఆర్పీగా విధులు నిర్వహిస్తూ కూలీల సొమ్ము వక్రమార్గంలో స్వాహా చేసిన నేరంపై తాము ఆధారాలతో నిరూపించినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం వహించడం తగదని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికీ విచారణ పేరిట కొంత సమయం జాప్యం చేశారని ఇప్పటికైనా వీఆర్పీ అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోకపోతే త్వరలోనే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని కూలీలు హెచ్చరించారు. వీఆర్పీ అక్రమాల నిరసిస్తూ గ్రామంలో ఎప్పటికీ ఉపాధి పనులను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇందులో గ్రామంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, గ్రామంలోని సుమారు 80 గ్రూపులకు చెందిన సొమ్మును వీఆర్పీ స్వాహా చేయడానికి సమర్ధించడం తగదని కూలీలు వ్యాఖ్యానించారు. వీఆర్పీపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సచివాలయం ఉద్యోగికి వినతి పత్రం అందజేశారు.