వైఎస్సార్​సీపీలో సీట్ల కొట్లాట - పార్టీకి రాజీనామాలు చేస్తున్న ఎమ్మెల్యే చిట్టిబాబు అనుచరులు - Leaders resignations in YCP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 10:09 AM IST

Confusion Over YSRCP Party Ticket for MLA Chittibabu : కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చిట్టిబాబును కాదని కొత్త వారికి టికెట్‌ ఇస్తామని అధిష్టానం చెబుతోంది. దీంతో పలువురు వైఎస్సార్​సీపీ నేతలు పార్టీకీ రాజీనామాలు చేస్తున్నారు. జగ్గంపేట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సుబ్బారావు తన పదవితో పాటు పార్టీకి రాజీనామ చేశారు. గతంలో తాము చేయించిన పనులకు సంబంధించిన బిల్లులను కోర్టును ఆశ్రయించి మంజూరు చేయించుకుంటామన్నారు. వైఎస్సార్​సీపీ హయాంలో మూడన్నరేళ్లుగా బిల్లులు మంజూరు కాని పరిస్థితి ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్యే నిర్ణయం మేరకు భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామన్నారు. అయితే త్వరలో కొందరు వైఎస్సార్​సీపీని వీడి టీడీపీలోకి చేరునున్నట్లు తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు పార్టీ అధిష్టానం మళ్లీ టికెట్ ఇవ్వాలని మద్దతు దారులు డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేసి ఏకగ్రీవంగా తీర్మానించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబుకు మళ్లీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.