తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ - ఆదుకుంటామని రైతులకు హామీ - cm jagan visit in bapatla district
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 5:55 PM IST
CM YS Jagan Interaction With Farmers in Bapatla: బాపట్ల జిల్లా తుపాను (Cyclone Michaung) ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. పాతనందాయపాలెంలో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి పరిశీలించారు. మరుప్రోలువారిపాలెంలో ఏర్పాటు చేసిన ఫొటోలను చూశారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన తర్వాత రైతులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు. తుపాను బాధిత కుటుంబాలకు 2500 రూపాయలు తక్షణ సాయం అందిస్తామని తెలిపారు. బాధితులను ఆదుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని, మరో వారంలో సాయం అందిందా లేదా తెలుసుకునేందుకు మళ్లీ వస్తానని తెలిపారు.
వాలంటీర్ల ద్వారా ఇంటికే పరిహారం అందిస్తామని చెప్పారు. పంటల బీమా, పెట్టుబడి రాయితీ రాదనే అపోహలు వద్దని పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఇన్సూరెన్సు, పెట్టుబడి రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా తుపాను బాధితులను ఆదుకుంటున్నామని సీఎం జగన్ తెలిపారు. తమ పార్టీని ఓటు వేయని వారికి కూడా పారదర్శకంగా సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. తాను మిగతా వారిలా ప్రచారం కోసం రాలేదన్నారు. సంక్రాంతి లోపు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని రైతులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.