కంటి ఆస్పత్రి నుంచి నేరుగా జగన్ సభకే - వృద్ధులకు వింత అనుభవం, ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సైతం! - ఏలూరు జిల్లా తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2023, 5:42 PM IST

Updated : Nov 17, 2023, 6:18 PM IST

‍‌CM Jagan Nuzvid Meeting People Problems : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూజివీడు సభకు వచ్చిన జనం ఇబ్బందులు పడ్డారు. సభకు వచ్చిన ప్రజలు మధ్యలో వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. సభ పూర్తయ్యే వరకూ ఉండాలని హుకూం జారీ చేశారు. సభ చుట్టూ బారికేడ్లు అడ్డుపెట్టారు. దీనివల్ల లోపల ఉండలేక, బయటికి వెళ్లలేక ప్రజలు అల్లాడిపోయారు. 

Police Stoped People Leaving Jagan Meeting In Eluru District : ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన వృద్ధులకు ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు రోజుల క్రితం కంటి ఆపరేషన్ చేశారు. ఇవాళ ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్పి... ఆసుపత్రి నుంచి బస్సులో నేరుగా ముఖ్యమంత్రి సభకు తరలించారు. సభ నుంచి వారు వెళ్లేందుకు యత్నించగా సీఎం ప్రసంగం అయ్యేంతవరకు ఉండాలని పోలీసులు వారికి చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులను కూడా జగన్ సభకు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి సభ ప్రారంభించిన ఎనిమిది నిమిషాలకే జనం బయటికి రావటం గమనార్హం.

Last Updated : Nov 17, 2023, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.