పండగవేళ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన- ముందు రోజు నుంచే విధిస్తున్న ఆంక్షలతో హడలెత్తుతున్న జనాలు - CM Jagan visit updates

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 6:31 PM IST

Updated : Dec 22, 2023, 7:45 PM IST

CM Jagan YSR district Visit Effect RTC Bus Routes Changes: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన అంటేనే ప్రజలు, ప్రయాణికులు, చిరు వ్యాపారులు, వాహనదారులు హడలెత్తిపోతున్నారు. సీఎం పర్యటన పేరుతో పోలీసులు విధించే ఆంక్షలతో నానా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ప్రజల క్షేమం గురించి ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి తన పర్యటనల కారణంగా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేపు సీఎం జగన్ వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారుల బస్సుల రాకపోకల్లో మార్పులు చేయటం హాట్ టాపిక్‌గా మారింది.

Passengers Fire on CM Visit: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ నెల (డిసెంబర్) 23, 24, 25 తేదీల్లో వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితోపాటు ఈ నెల 25వ తేదీన జరగబోయే క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఫలానా జిల్లాలో, ఫలానా తేదీన పర్యటించబోతున్నారని అధికారులు వెల్లడించగానే, సంతోషించాల్సిన కడప జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీఎం పర్యటన పేరుతో బస్టాండ్లలో బస్సులు ఉండవనీ, రోడ్లను బారికేడ్లతో బంద్ చేస్తారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సీఎం పర్యటన కారణంగా ఆర్టీసీ అధికారులు బస్సుల రాకపోకల్లో మార్పులు చేశారు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్ నేపథ్యంలో దాదాపు రెండు మూడు గంటలపాటు బస్సులను శివారు ప్రాంతాలలో నిలిపేశారు. దీంతో బస్సుల కోసం ప్రయాణికులు కొత్త బస్టాండ్, పాత బస్టాండ్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. అయినా, బస్సులు రాకపోవడంతో చేసేదేమీ లేక ప్రయాణికులు ఆటోలలో శివారు ప్రాంతాలకు వెళ్లారు. 

Last Updated : Dec 22, 2023, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.