CM Jagan Review: పంటలకు కనీస మద్దతు ధర కల్పనకు.. ఏపీ ఎంఎస్‌పీ యాక్ట్ - ఉద్యానవన శాఖపై సీఎం జగన్ సమీక్ష
🎬 Watch Now: Feature Video
CM Jagan Review on Agriculture and horticulture department: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కేందుకు ప్రత్యేక చట్టం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి జగన్.. ఏపీ ఎంఎస్‌పీ యాక్టు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా ఎంఎస్‌పీ ధరలు ఇవ్వాల్సిందేనని ఈ మేరకు చట్టం చేయాలని సీఎం నిర్దేశించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ఖరీఫ్ సన్నద్ధతతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాల ప్రగతిపై ఆరా తీశారు. డెయిరీ, ఆక్వా రైతుల ఉత్పత్తులకు ఈ చట్టం ద్వారా రక్షణ కల్పించాలన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని.. 10 వేల ఆర్బీకేల్లో.. 10 వేల డ్రోన్లు అందుబాటులో ఉంచాలని నిర్దేశించారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ రంగంలో బహుళ ప్రయోజనాలు పొందాలన్నారు. కౌలు రైతులకు రైతుభరోసా అందేలా చూడాలన్న సీఎం.. శీతల గిడ్డంగులు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు గురయ్యే టమోటా, ఉల్లిలాంటి పంటల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం.. ఈ పంటల సాగు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని ఆదేశించారు.