సీఎం జగన్ బహిరంగ సభలో విద్యార్థుల పాట్లు - జెండాలు, కటౌట్లు మోయించిన వైసీపీ శ్రేణులు - చింతపల్లిలో సీఎం జగన్ బహిరంగ సభ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 7:23 PM IST
CM Jagan Public Meeting at Chintapalli: అల్లూరి జిల్లా చింతపల్లిలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభకు ప్రజలు స్పందన కరవైంది. గ్రామాల వారీగా జనాలను తరలించడానికి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ చింతపల్లి వెళ్లడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు.
Students Problems in CM Jagan Public Meeting: జనాలు రాకపోవడంతో పాఠశాల, కళాశాల విద్యార్థులపై ఆధారపడ్డారు. దీంతో తెల్లవారుజాము నుంచి చింతపల్లి చుట్టుపక్కల ప్రాంతాల పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులను బస్సులలో సభ వద్దకు తరలించారు. దీనిలో భాగంగా విద్యార్థులతో పార్టీ జెండాలు, కటౌట్లు మోయించారు. కార్యక్రమం ప్రారంభమయ్యే సమయానికి సభ ప్రాంగణంలో విద్యార్థులే పెద్ద సంఖ్యలో కనిపించారు. ఇక ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే సభకు వచ్చిన జనాలు ఇంటిముఖం పట్టారు.
CM Jagan Comments on TDP Manifesto: ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి భావితరాల భవిష్యత్ కోసమేనని సీఎం జగన్ అన్నారు. అల్లూరి జిల్లా చింతపల్లిలో విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడారు. తెలుగుదేశం ఆరు గ్యారెంటీల హామీలపై విమర్శలు గుప్పించారు. తాము ఇస్తున్న వాటి కంటే మూడురెట్లు అధికంగా హామీలు ఉన్నాయని చెప్పారు.