CM Jagan Enquiry on Governor Abdul Nazeer Health: గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా.. దేవుడిని ప్రార్థించిన లోకేశ్ - అబ్దుల్ నజీర్‌ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 11:36 AM IST

CM Jagan Enquiry on Governor Abdul Nazeer Health : ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌(Abdul Nazeer Health Situation) ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఆరా తీశారు. అస్వస్థతకు గురై విజయవాడ మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అపెండిసైటిస్‌ సర్జరీ జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గవర్నర్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వివరించారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.  

Abdul Nazeer Treatment in Manipal Hospital at Vijayawada : గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ కడుపు నొప్పి సంబంధిత సమస్యతో సోమవారం మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్టు తేలింది. గవర్నర్‌కు రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసిటోమీ విజయవంతంగా నిర్వహించినట్టు మణిపాల్‌ ఆస్పత్రి ఓ బులిటెన్‌లో (Manipal Hospital on Bulletin Abdul Nazeer Health) వెల్లడించింది.

Nara lokesh Enquiry on Governor Abdul Nazeer Health అనారోగ్యానికి గురై మ‌ణిపాల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్, జస్టిస్‌ అబ్దుల్ నజీర్ త్వర‌గా కోలుకోవాల‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్ దేవుడిని ప్రార్థిస్తున్నా అన్నారు. క‌డుపునొప్పితో గ‌వ‌ర్నర్ ఆస్ప‌త్రిలో చేరార‌ని తెలిసి తీవ్ర ఆందోళ‌న‌కి గుర‌య్యానని తెలిపారు. అపెండిసైటిస్​గా తేల్చిన వైద్యులు ఆప‌రేష‌న్ విజయవంతంగా చేశార‌ని, ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌నే స‌మాచారం తెలిసి ఊపిరి పీల్చుకున్నానని వెల్లడించారు. గ‌వ‌ర్నర్ సంపూర్ణ ఆరోగ్యంతో మ‌న ముందుకు వ‌స్తార‌ని ఆకాంక్షించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.