కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమంలో ఉద్రిక్తత - ఇరు వర్గాల మధ్య వాగ్వాదం - ఎన్టీఆర్ జిల్లా లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 4:35 PM IST

Clashes in Kakani Venkata Ratnam Death Anniversary: విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమం రసాభాసగా మారింది. కాకాని వెంకటరత్నం వారసుడు తరుణ్ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి(MLA Yalamanchili Ravi) అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. కాకాని వారసుడు తరుణ్ కాదంటూ రవి అనుచరులు నినాదాలు చేశారు. తరుణ్ పైకి రవి అనుచరులు దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ(Jai Bharat Party President JD Lakshminarayana) కాకాని విగ్రహానికి నివాళులర్పిస్తున్న సమయంలో వివాదం జరిగింది. 

Conflict at Kakani Venkata Ratnam Statue in Bezawada: కాకాని విగ్రహం తొలగిస్తున్నప్పుడు(Kakani Venkatatnam Statue Removal Issue) పోరాడిన వాళ్లని పక్కనపెట్టి రాజకీయ లబ్ధి కోసమే ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారని రవి అనుచరులు మండిప్డడారు. యలమంచిలి రవి జోక్యం చేసుకుని తన అనుచరులకు నచ్చచెప్పడంతో వారు వెనక్కి తగ్గారు. ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొనడంతో కాకాని తరుణ్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.