కురుబ సంఘం గుడికట్ల సభలో ఘర్షణ- స్టేజీపైనే తోసుకున్న వైసీపీ, టీడీపీ నేతలు - Argument at Gudikatla festival

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2023, 4:35 PM IST

Clash Between TDP and YCP Leaders in Gudikatla Festival: అనంతపురంలో నిర్వహిస్తున్న కురుబ సామాజికవర్గం గుడికట్ల ఉత్సవాల్లో రాజకీయ నేతల మధ్య గొడవ జరిగింది. కొంతమంది నాయకుల వల్ల కురబల్లో ఐక్యత కొరవడిందన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలను.. తెలుగుదేశం నేత పార్థసారథి తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో గోరంట్ల మాధవ్, పార్థసారథి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగి ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఈ గొడవ తర్వాత మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్ సభ నుంచి వెళ్లిపోయారు. 

ప్రజాదరణ కోసం వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా.. అది అట్టర్ ఫ్లాప్ అవుతోంది. తొలుత గడపగడపకు కార్యక్రమం మొదలుపెట్టగా.. వెళ్లిన ప్రతి చోట.. ప్రజలంతా ఏకమై వైసీపీ నేతలను కడిగిపారేశారు. ఏ ముఖం పెట్టుకుని వస్తారంటూ మండిపడ్డారు. ఇక ఇప్పుడు బస్సు యాత్ర వంతు వచ్చింది. సభలకు రాకుంటే పథకాలు ఆపేస్తామమని ప్రజలను బెదిరించి తీసుకొస్తున్నారు. దీంతో వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమం కూడా అట్టర్​ఫ్లాప్​ అయింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.