TDP and YCP clash: టీడీపీ, వైసీపీ నేతల ఘర్షణ.. ఎమ్మెల్యే అవినీతి నిరూపిస్తానంటూ సవాల్ - MLA Satthi Suryanarayana Reddy corruption

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 19, 2023, 7:59 PM IST

Clash between TDP and YCP leaders: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తెలుగుదేశం, వైసీపీ నేతల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కోవిడ్ సమయంలో దాతలు ఇచ్చిన కోటిన్నర నిధులు గోల్ మాల్ అయ్యాయని.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ విరాళాల ఖర్చులపై ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఇదే అంశాలపై బహిరంగ చర్చకు రావలంటూ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అనుచరులు.. లెక్కలు చెబుతామంటూ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో తెలుగుదేశం, వైసీపీ నేతల మధ్య వాగ్వాాదం తలెత్తి తోపులాటకు దారితీసింది. ఎమ్మెల్యే అనుచరులు చర్చకు రావడంపై రామకృష్ణారెడ్డి ఆక్షేపణ తెలిపారు. అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి సమాధానం చెప్పాలని లేదంటే... అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తానని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పరస్పరం ఘర్షణకు యత్నించిన ఇరు వర్గాల వారిని పోలీసులు నిలువరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.