Retd Headmaster Chits Fraud: నమ్మి ఇస్తే నట్టేట ముంచాడు.. లబోదిబోమంటున్న బాధితులు - వైఎస్సార్ జిల్లాలో చిట్టీల పేరుతో మోసం
🎬 Watch Now: Feature Video
Retd Headmaster Fraud: రాష్ట్రంలో చిట్టీల పేరుతో వరుస మోసాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బాపట్ల జిల్లా, చిత్తూరు జిల్లాలో చిట్టీల పేరుతో మోసాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా వైఎస్సార్ జిల్లాలోని కసలపాడుకి చెందిన ఓ రిటైర్డ్ హెడ్మాస్టర్ చిట్టీల పేరుతో దాదాపు 150 మందిని మోసం చేశాడు. మోసపోయిన వారిలో అధికంగా వృద్ధులు, మహిళలు ఉన్నారు. కసలపాడుకి చెందిన ప్రభాకర్ రెడ్డి అనే రిటైర్డ్ హెడ్మాస్టర్.. గత కొంత కాలం నుంచి స్థానికుల నుంచి చిట్టీల వేయిస్తూ వడ్డీలకు డబ్బులు తీసుకునేవాడు. వడ్డీ వస్తుందని అత్యాశతో ప్రజలందరకూ అతనికి లక్షల రూపాయలు ఇచ్చారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి ప్రభాకర్ రెడ్డి కనిపించడం లేదు. ప్రబాకర్ రెడ్డి కనిపించకపోవడంతో.. బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. సుమారు 150 మంది నుంచి రెండు కోట్ల రూపాయలను తీసుకొని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పిల్లల చదువుల కోసం ఉపయోగపడతాయని చిట్టీలు వేశామని బాధితులు వాపోతున్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు.