వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల ముచ్చట్లు - కప్ మనదే అని ధీమా - విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 19, 2023, 5:32 PM IST
Chit Chat with Cricket Fans in Vijayawada: విజయవాడలో క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ సందడి నెలకొంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్ అభిమానుల కోసం మూడు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మూడో సారి భారత్ ప్రపంచకప్ నెగ్గడం ఖాయమని.. క్రికెట్ అభిమానులు ఆకాంక్షించారు. విజయవాడలోని క్రికెట్ అభిమానులతో ఈ టీవీ ముచ్చటించింది. వరల్డ్ కప్ కావడంతో అభిమానులు ఈ సారి కప్పు మనకే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌లో దిగింది.
ప్రస్తుతం మ్యాచ్‌లో 148 పరుగులు చేరుకున్న సమయంలో.. భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో ఆట మరింత ఉత్కంఠగా సాగుతోంది. విజయవాడలో అభిమానులు ఉత్సహంగా ఆటను విక్షిస్తు.. భారత్ ఈ సారి ఆటలో గెలవాలని కోరుకుంటున్నారు. సెమీ ఫైనల్ న్యూజిలాండ్‌ను ఇంటికి పంపి.. భారత్ ఫైనల్‌కు చేరుకుని.. ఇప్పుడు ఫైనల్లో ఆడటం సంతోషంగా ఉందని టీమీండియాను అభినందిస్తున్నారు. ఇందిగా గాంధీ స్టేడియంలో క్రికెట్ అభిమానులతో ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం.