Childrens Protest For School: 'మాకు పాఠశాల కావాలి జగన్ మావయ్య..' ప్లకార్డులతో చిన్నారుల నిరసన
🎬 Watch Now: Feature Video
Childrens Protest For School In Paderu : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సల్దిగడ్డ గ్రామంలో పాఠశాల కావాలంటూ పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద సర్పంచ్‌తో కలిసి విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసన తెలిపారు. 'జగన్ మావయ్య మాకు స్కూల్ కావాలి.. రోడ్డు కావాలి.. అంగన్వాడీ కావాలి' అంటూ.. చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. రహదారి కూడా లేకపోవడంతో తమ గ్రామానికి చెందిన 40 మంది చిన్నారులు నిత్యం రెండు కొండలు ఎక్కి పక్క గ్రామానికి వెళ్లి చదువుకోవాల్సి వస్తుందని సర్పంచ్ చిట్టమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అంత దూరం రాకపోకలు సాగించలేక చిన్నారులు విద్యకు దూరం అవుతున్నారని గిరిజన పోరాట సమితి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాడేరు ఐటీడీఏకు దగ్గరలో ఉన్న గ్రామానికి పాఠశాల లేనట్లయితే మారుమూల పరిస్థితి ఏమిటని గిరిజన పోరాట సమితి నాయకులు రామారావు దొర ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్, ఐటీడీఏ పీఓ స్పందించి తమ ప్రాంతంలో పాఠశాల, రహదారి, అంగన్వాడి భవనాన్ని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
TAGGED:
Childrens protest for school