బుడిబుడి నడకలు, చిట్టిపొట్టి డ్రెస్సులు - ఫ్యాషన్ షోలో అలరించిన జూనియర్ మోడల్స్ - ఆసక్తికరంగా మారినా ఫ్యాషన్ షో పోటీలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 1:19 PM IST

Updated : Nov 6, 2023, 2:57 PM IST

Children Fashion Show in Visakhapatam: బుడిబుడి నడకలు, చిట్టిపొట్టి డ్రెస్సులతో ర్యాంప్​వాక్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు చిన్నారులు. ఫ్యాన్సీ డ్రెస్సు​లతో ర్యాంప్​పై తళుక్కుమన్నారు. విశాఖలోని ఓ హోటల్లో జూనియర్ మోడల్స్ సీజన్-3 పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో పోటీలు చూపరులను అలరించాయి. 5 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులకు రెండు విభాగాలుగా ఈ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. దీంతో హోటల్ ప్రాంగణం అంతా సందడి వాతావరణం నెలకొంది. 

క్వీన్ ఈవెంట్స్ ఆర్గనైజర్​ ఉషారాణి ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా సినీనటుడు ప్రసన్నకుమార్ హాజరయ్యారు. పోటీలను వీక్షించిన ప్రసన్నకుమార్.. పిల్లలు చదువుతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు ఆయన చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతిక, సంప్రదాయలపై అవగాహన కలిగి ఉండాలి.

Last Updated : Nov 6, 2023, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.