Killed with lorry: గుంటూరు జిల్లాలో దారుణం.. చెక్‌పోస్టు ఉద్యోగిని లారీతో ఢీకొట్టి హత్య - Check post employe killed with lorry
🎬 Watch Now: Feature Video
Check post employee killed విధుల్లో ఉన్న సిబ్బందిని లారీతో ఢీకొట్టి చంపేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు మార్కెట్‌యార్డు చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది హుస్సేన్ బాష అనే వ్యక్తిని ధాన్యం లారీతో ఢీకొట్టి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. వట్టిచెరుకూరు మండలం కారంపూడి నుంచి నరసరావుపేటలోని ఓ రైస్‌మిల్లుకు లారీలో ధాన్యం తరలిస్తున్నారని చెప్పారు. నారాకోడూరు చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న హుస్సేన్ బాష లారీని ఆపాలంటూ ఎర్రజెండా చూపినా ఆపకుండా వెళ్లిపోవడంతో....ద్విచక్ర వాహనంపై కొంతదూరం వెంబడించినట్లు తెలిపారు. లారీగా అడ్డుగా బైక్‌కు పెట్టేందుకు హుస్సేన్ బాష యత్నించడంతో ఆయన్ను తొక్కుకుంటూ లారీ డ్రైవర్ ముందుకెళ్లిపోయాడని.. ఈ ఘటనలో హుస్సేన్ బాష అక్కడికక్కడే మృతిచెందాడని వివరించారు. జరిగిన ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పొన్నూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ వెల్లడించారు. కేసు నమోదు చేసిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.