Chandrababu Projects Tour: చంద్రబాబు ప్రాజెక్టుల టూర్.. తెలుగు తమ్ముళ్ల సందడి - Chandrababu Projects Tour
🎬 Watch Now: Feature Video
Chandrababu Projects Tour in Rayalaseema: టీడీపీ అధినేత చంద్రబాబు రాకతో నందికొట్కూరు దద్దరిల్లింది. కనుచూపుమేరలో ఎటుచూసినా.. తెలుగు తమ్ముళ్లే కనిపించారు. ‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’ పేరుతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి పర్యటన ప్రారంభించారు. 10 రోజులు ప్రాజెక్టులను సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన అనంతపురం, వైయస్సార్, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు ప్రాజెక్టుల విధ్వంసంపై 'యుద్ధభేరి' పేరిట ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులోని పటేల్ సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ రోజు ఉదయం ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబుకు.. టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి చంద్రబాబు నందికొట్కూరు చేరుకున్నారు. నందికొట్కూరులో రోడ్డు షో, బహిరంగసభలో పాల్గొన్నారు. రోడ్డు షో, బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులతో.. రహదారులన్నీ జనసందోహంగా మారాయి. నేడు ముచ్చుమర్రి, బనకచర్ల ప్రాజెక్టుల సందర్శన అనంతరం.. చంద్రబాబు రాత్రికి జమ్మలమడుగు వెళ్లనున్నారు. బహిరంగ సభలో చంద్రబాబు సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.