విజన్-2020 అన్నప్పుడు అందరూ హేళన చేశారు: చంద్రబాబు - విజన్ 2020
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 3:55 PM IST
Chandrababu Naidu Comments on IT Industry : ప్రపంచంలోనే తెలుగు వారు నంబర్‌వన్‌గా ఉండాలనేది తన ఆకాంక్షని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రోత్సహించానని, అప్పట్లో విజన్-2020 అని చెప్పినప్పుడు హేళన చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
వైఎస్సార్సీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలు ఎందుకు ముఖ్యమనేది ప్రజలకు వివరించాలని సూచనలు చేశారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తన జీవిత ఆశయమని అన్నారు. పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని తెలిపారు. తనని మొదటిసారి విద్యార్థులే గెలిపించారని పేర్కొన్నారు. భారత్‌లోని కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని చంద్రబాబు నాయుడు తెలిపారు.
CBN Meets TDP Leader Trilok In Bangalore Karnataka : అంతకుముందు బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు త్రిలోక్‌ను పరామర్శించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కుప్పంలో ఆందోళన చేస్తున్న త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురైన త్రిలోక్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. టీడీపీ అండగా ఉంటుందని త్రిలోక్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.