Chandrababu Health Update: "చంద్రబాబు కంటికి చికిత్స చేయాలని ప్రభుత్వ వైద్యుల నివేదిక.. కానీ.." - చంద్రబాబు వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2023, 10:10 AM IST
Chandrababu Health Update : రాజమహేంద్రవరం జైలులో ఉన్న మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని.. ఆయన ఆరోగ్య సమస్యలను కావాలనే దాచిపెడుతోందని టీడీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రబాబు కంటి సమస్యకు చికిత్స అవసరమని.. ఆయన్ను పరిశీలించిన ప్రభుత్వ ఆస్పత్రి కంటి వైద్యులు నివేదిక ఇచ్చినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఇప్పట్లో కంటికి ఎలాంటి చికిత్స అవసరం లేదన్నట్లుగా ఆ నివేదికను మార్చి ఇవ్వాలని ప్రభుత్వ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు నాయుడు హెల్త్ బులెటిన్ (Chandrababu Naidu Health Bulletin)లో కంటి సమస్యను ప్రస్తావించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు నాలుగు నెలల క్రితం ఒక కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని.. రెండో కంటికి వెంటనే ఆపరేషన్ అవసరం లేదని, ఆయన్ను పరిశీలించిన వైద్యులు చెప్పారని జైలు సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు.