అంజుమన్ ఆస్తులపై వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జ్ సవాళ్లు.. మోహరించిన పోలీసులు - Guntur District Anjuman properties issue news
🎬 Watch Now: Feature Video
Challenges on properties of Guntur District Anjuman: అంజుమన్ ఆస్తులపై గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు తూర్పు టీడీపీ ఇన్చార్జ్ నసీర్ అహ్మద్ మధ్య సవాళ్లతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంటూరులోని అంజుమన్ ఇస్లామియాపై.. ఎమ్మెల్యే ముస్తఫా కన్నుపడిందని.. తమ్ముడు, బావమరిదిని అధ్యక్ష కార్యదర్శులుగా నియమించుకుని అవకతవకలకు పాల్పడ్డారని.. టీడీపీ గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆరోపించారు. దీనిపై చర్చకు వస్తే నిరూపిస్తామని సవాల్ విసిరారు. దీన్ని తోసిపుచ్చిన ఎమ్మెల్యే ముస్తఫా.. బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిసవాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. సవాళ్లు ప్రతిసవాళ్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా నగరంలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో అంజుమన్ షాదీఖాన వద్దకు చేరుకున్న తెలుగుదేశం నేత నసీర్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మినీ లారీలోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంజుమన్ సంస్థకు చెందిన ఆస్తులను ఆక్రమించుకోడానికి వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా.. తన తమ్ముడు, బావమరిదిని అధ్యక్ష కార్యదర్శులుగా నియమించుకున్నారని.. చర్చకు వస్తే నిరూపిస్తామని.. టీడీపీ గుంటూరు తూర్పు ఇన్చార్జ్ నసీర్ అహ్మద్ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ముస్తఫా.. బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిసవాల్ చేశారు. నినాదాలు చేసుకుంటూ టీడీపీ ఇన్చార్జ్ నసీర్ అహ్మద్ అంజుమాన్ షాదీఖాన వద్దకు చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. నసీర్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకొని.. మినీ లారీలోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.