CBN Pulivendula Tour టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలతో నిండిపోయిన పులివెందుల కూడళ్లు! చంద్రబాబు సభకు ఇంకా అనుమతివ్వని పోలీసులు! - Chandrababu Flexis in Pulivendula
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-08-2023/640-480-19159162-149-19159162-1690954352642.jpg)
Chandrababu Tour In Pulivendula: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ రోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పులివెందులలో ఈ రోజు సాయంత్రం రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు పోలీసులు అనుమతినివ్వలేదు.. దీంతో పులివెందులలో రోడ్‌షో, సభ అనుమతిపై సందిగ్ధత నెలకొంది. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మంగళవారం రాత్రి జమ్మలమడుగు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు గండికోట ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడి నుంచి బలపనూరు చేరకుని మధ్యాహ్న భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం పులివెందుల చేరుకుంటారు. పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్ద రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మరోవైపు ఈ రోజు చంద్రబాబు పర్యటనపై టీడీపీ నేతలు స్పందించారు. పులివెందులలో చంద్రబాబు సభను విజయవంతం చేస్తామని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పష్టం చేశారు. పులివెందుల పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన జగన్.. ఇక రాష్ట్రానికి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు.