Ayesha Meera Case: తెరపైకి ఆయేషా మీరా హత్య కేసు.. మళ్లీ విచారణ ప్రారంభించిన సీబీఐ - తెరపైకి ఆయేషా మీరా హత్య కేసు
🎬 Watch Now: Feature Video
Ayesha Meera Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) అధికారులు మళ్లీ ప్రారంభించి.. గత కొద్ది రోజులుగా విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయం కేంద్రంగా ఈ హత్య కేసు విచారణ జరుగుతోంది. ఆయేషా మీరా నివాసం ఉన్న హాస్టల్ వార్డెన్ పద్మను సీబీఐ అధికారులు తాజాగా విచారించారు. నందిగామ పరిధిలో ఓ మహిళను విచారించినట్లు సమాచారం. కొన్ని నెలల కిందట ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేసేందుకు శాంపిల్స్ తీసుకెళ్లారు. ఇటీవలె దానికి సంబంధించిన పంచనామా నివేదిక వచ్చింది. ఆ నివేదిక ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. సీబీఐ కేసును స్వీకరించిన తర్వాత కొంత వేగంగా విచారించిన అధికారులు.. చాలా కాలం స్తబ్ధతగా ఉండిపోయారు. తాజాగా విచారణ తిరిగి ప్రారంభించారు. అయితే చాలా కాలం తర్వాత ఆయేషా మీరా హత్య కేసు విచారణ ప్రారంభం కావడంతో ప్రస్తుతం ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.