CBI Investigation on Liquor Sales ఏపీలో మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ కోరతాం.. వైసీపీ నేతల జేబుల్లోకే లిక్కర్ సొమ్ము: పురందేశ్వరి - Purandeshwari

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2023, 4:05 PM IST

CBI investigation on liquor sales : రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణను కోరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణం తనిఖీ చేసినప్పుడు లక్ష రూపాయల వరకు విక్రయాలు జరిగితే.. అందులో డిజిటల్‌ చెల్లింపులు జరిపింది కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమేనన్న విషయం తమ పరిశీలనలో బయటపడిందన్నారు. దుకాణాదారున్ని విక్రయాల గురించి ప్రశ్నించామన్నారు. 

ప్రతి రోజు మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనధికారింగా వైసీపీ నాయకుల జేబుల్లోకి భారీ మొత్తాలు వెళ్తున్నాయనే విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. ప్రజల జేబుల నుంచి డబ్బులు దోచుకుని ఉచితాలు ఇస్తున్నామనే దిశగా మాట్లాడడం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్దనీయకం కాదని అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నరేంద్రమోదీ ఫోటో ఎగ్జిబిషన్‌ను పురందేశ్వరి ప్రారంభించి... పార్టీ నాయకులతో కలిసి తిలకించారు. ఈనెల 17 నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు సేవా పక్షోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.