సీబీఐ కోర్టులో వైఎస్ వివేకా కేసు అప్రూవర్ దస్తగిరి పిటిషన్​పై విచారణ వాయిదా - దస్తగిరి పిటిషన్​పై విచారణ వాయిదా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 2:47 PM IST

CBI Court on Viveka Case Approver Dastagiri petition: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి పిటిషన్​పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. తనను నిందితుల జాబితా నుంచి తొలగించి.. సాక్షిగా పరిగణించాలని దస్తగిరి గతవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 

Dastagiri Petition in CBI court: కానీ ఇవాళ మిగతా నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్లు దాఖలు చేయలేదు. కాస్త సమయం కావాలని కోర్టును కోరడంతో.. దీనిపై విచారణను ఈ నెల 20కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. వివేకా హత్య కేసు(YS Viveka Murder Case)లో దస్తగిరి ఏ-4 నిందితుడిగా ఉన్నారు. అప్రూవర్​గా మారడంతో మొదటి ఛార్జిషీట్​లో సీబీఐ అధికారులు తన పేరును సాక్షిగా చేర్చారని.. దీన్ని పరిగణలోకి తీసుకోవాలని దస్తగిరి పిటిషన్(Dastagiri Petition)​లో కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.