CBI Court Hearing on Jagan London Tour Petition: విదేశాలకు వెళ్లేందుకు అనుమతించండి.. జగన్ పిటిషన్పై రేపు నిర్ణయం - Cm jagan news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2023, 10:17 PM IST
|Updated : Aug 30, 2023, 10:34 PM IST
CBI Court Hearing On Jagan London Tour Petition: అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దని.. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టును సీబీఐ అధికారులు విజ్ఞప్తి చేశారు. సెప్టెంబరు 2 నుంచి 9వ తేదీ మధ్య లండన్‌లో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతివ్వాలని వైఎస్ జగన్, యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, జర్మనీ, అమెరికా, సింగపూర్, దుబాయ్ వెళ్లేందుకు 30 రోజల పర్యటనకు అనుమతివ్వాలని విజయసాయిరెడ్డిలు వేర్వేరుగా వేసిన పిటిషన్లపై బుధవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
విచారణలో భాగంగా దేశం విడిచి వెళ్లరాదనే అక్రమాస్తుల కేసు బెయిల్ నిబంధనలను సడలించాలని జగన్, విజయసాయిరెడ్డిల తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. కానీ, సీబీఐ మాత్రం వారిద్దరికీ బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును గురువారానికి వాయిదా వేసింది. జగన్, విజయసాయిరెడ్డిల పిటిషన్లపైనా ఇవాళ వాదనలు ముగియడంతో.. గురువారం సీబీఐ కోర్టు ఏ నిర్ణయాన్ని వెల్లడిస్తోందని అధికార పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ..కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో అనుమతించాలా..? వద్దా..? అనే నిర్ణయాన్ని ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది.