Caste Deportation: ఎన్నికల్లో వేరే పార్టీకి మద్దతు చెప్పారని కుల బహిష్కరణ - పల్నాడు జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18399465-963-18399465-1683010131764.jpg)
Caste Deportation In Pedakurapadu : గత అసెంబ్లీ ఎన్నికల్లో కులం కట్టుబాటును తప్పించి మరోపార్టీకి మద్దతుగా నిలిచారంటూ కొన్ని కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో ముస్లిం మైనారిటీల్లో ఓ వర్గాన్ని మసీదుకు రాకుండా కట్టడి చేయటం కలకలం రేపింది. గ్రామ మాజీ సర్పంచ్ షేక్ మస్తాన్‌వలితో పాటు మరికొందరు తమను కులం నుండి వెలివేశారంటూ షేక్ నాగుల్‌మీరా, ఆదం షఫీ, హుస్సేన్‌లు పెదకూరపాడు పోలీస్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన మసీదుకు రంజాన్ ప్రార్ధనలకు సైతం తమను అనుమతించ లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ సోమవారం రాత్రి పొడపాడు గ్రామంలో విచారణ చేపట్టారు. ఇరు వర్గాలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో మొలగాలని సూచించారు. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తామని, గ్రామంలో శాంతిని నెలకొల్పే విధంగా చర్యలు జరుపుతున్నామని, అసాంఘీక చర్యలకు పాల్పడితే ఎవరినీ ఊపేక్షించమని ఆదినారాయణ హెచ్చరించారు. ఈ సమావేశంలో రెవిన్యూ అధికారులు కూడా ఉన్నారు.