Car Crashed into the Canal: తూర్పుగోదావరి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు విద్యార్థులు మృతి - తూర్పుగోదావరి జిల్లా రోడ్డు ప్రమాదాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-08-2023/640-480-19193802-576-19193802-1691292029417.jpg)
Students vehicle Falls into Canal: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందగా.. మరో ముగ్గురు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు రెండు కార్లలో అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలంలోని పర్యాటక క్షేత్రాల సందర్శనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బూరుగుపూడి సమీపంలోని కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఉదయ్ కిరణ్, హర్షవర్ధన్, హేమంత్ అనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కారును బయటికి తీసి.. దర్యాప్తు చేపట్టారు. చీకటిగా ఉండటం, కారు అతివేగంగా ప్రయాణించటంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.