ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం - కాలువలోకి దూసుకెళ్లిన బస్సు, ఇద్దరు మృతి - బస్సు ప్రమాదంలో ఇద్దరు మృతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 5:48 PM IST
Bus Accident in Eluru District : ఏలూరు జిల్లా కైకలూరు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఏలూరు నుంచి భీమవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు పంట కాలువలోకి ఒక్కసారిగా దూసుకెళ్లడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని మండవల్లి మండలం కాకతీయ నగర్ వద్ద బస్సు లారీని తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన దారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మహిళను హుటాహుటిన కైకలూరు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
RTC Bus Crashed into the Canal : ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు స్పందించి బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటికి తీశారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 61 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు.