సమస్యను చెప్పేందుకు ధైర్యంగా ముందుకొచ్చిన బాలుడు - అవాక్కయిన గ్రామస్థులు - గూళ్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 12:38 PM IST

Boy Criyed For Road in Karnool District : తమ కాలనీలో రోడ్డు వేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఓ బాలుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తమ కాలనీలో కొలతలు తీసుకొని వేరే కాలనీలో రోడ్డు వేస్తున్నారంటూ కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన బాలుడు వాపోయాడు. తెలుగుదేశం సీనియర్ నేత కోట్ల సుజాతమ్మ 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమంలో భాగంగా గూళ్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు వింత అనుభవం ఎదురైంది. గ్రామస్తులు బాలుడిని వారిస్తుండగా సుజాతమ్మ వారిని అడ్డుకున్నారు. పూర్తిగా చెప్పమని బాలుడికి ధైర్యం చెప్పారు.

TDP Leader Kotla Sujathamma Babu Surity Programme : తమ కాలనీలో రహదారి మార్గం సరిగ్గా లేదని, తెలుపుతూ బాలుడు కన్నీటి పర్యంతమయ్యాడు. అంతమంది ప్రజలు చెప్పలేని సమస్యను ఆ పిల్లవాడు చెప్పడం కార్యక్రమంలోని వారందరినీ కదిలించింది. రోడ్డులేక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే అంత భావోద్వేగంగా తమ అసౌకర్యన్ని వెలిబుచ్చాడని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పూర్తిగా విన్న సుజాతమ్మ.. బాలుడికి ధైర్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.