రుషికొండ మీద నిర్మాణాలపై న్యాయస్థానాల ఆదేశాల ప్రకారమే వెళ్తాం: బొత్స సత్యనారాయణ - జగన్ బస్సు యాత్రపై వైసీపీ
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 5:48 PM IST
|Updated : Nov 4, 2023, 6:10 PM IST
Botsa Satyanarayana Comments on Rushikonda: రుషికొండపై నిర్మాణాల విషయంలో న్యాయస్థానాల ఆదేశాల ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వైసీపీ సామాజిక సాధికార భరోసా యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో ఆయన.. మీడియా సమావేశంలో మాట్లాడారు. న్యాయవ్యవస్థపై తమ ప్రభుత్వానికి నమ్మకం ఉందన్నారు. ఇసుక ఉచితం పేరుతో గతంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. వాటి ఆధారంగానే టీడీపీ నేతలపై కేసులు పెట్టామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గతంలో ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. అందుకే, టీడీపీ నేతపై కేసు పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో వర్షపాతం, పంట దిగుబడుల ఆధారంగా మొదటి విడత కరవు మండలాల జాబితా ప్రకటించినట్లు బొత్స తెలిపారు. రెండో విడతగా ఆయా జిల్లాల్లో పరిస్థితులు, అధికారుల నివేదిక ఆధారంగా మలి విడత కరవు మండలాలు ప్రకటిస్తామని బొత్స చెప్పారు. పంట కోల్పోయిన ప్రతి రైతుని ఆదుకుంటామన్నారు. కుల గణన ద్వారా భవిష్యత్ లో అన్ని వర్గాల వారికి అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని అన్నారు.