Vote Deletion: "నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగించారు.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం" - భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
Bonda Umamaheshwar Rao On Vote Deletion: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లను తొలగించారని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. ఓట్ల తొలగింపు, జాబితాలోని అవకతవకలపై తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు బొండా ఉమ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబేకాలనీలో తెలుగుదేశం పార్టీతోనే భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అందులో భాగంగా ఇంటింటి ప్రచారం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్లు కలిసి ఓట్లు తొలగించినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఓట్ల తొలగింపు కోసం ఉన్న నియామాలను విస్మరించి.. ఓట్లను తొలగించారని ఆయన మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో 2022 సాధారణ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఓటర్ల నివాసాలకు దూరంగా ఉండే పోలింగ్ బూత్‌లో ఓట్లను కేటాయించారని అన్నారు. ఇంట్లో భర్తకు ఓటు ఉంటే భార్యకు లేదని.. భార్యకు ఉంటే భర్తకు లేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గటానికే ఇలా చేశారని విమర్శించారు.